Nee sakalpamlo Lyrics


నీ సంకల్పంలో నేనున్నందున
నను పిలిచి స్వీకరించిన నా దేవా
నన్ను ముందుగా నిర్ణయుంచి
 నీయందు స్వాస్థ్యముగా నన్నేర్పరచి
సమస్తము నామేలుకై జరిగించుచున్నావా
1. తరతరములకు ఉండును నీ సంకల్పములు
సదాకాలము నిలుచును నీ ఆలోచనలు
నిను దేవుడుగా గల జనులు ధన్యులు
పూర్ణ మనస్సుతో నిను సేవించెదను
నిను ప్రేమించెదను - నీ రూపం పొందెదను
2. ఎరిగినవాడవు నీవు మా సంకల్పములు
పరిశోధించి చూచెదవు మా ఆలోచనలు
నిను వెదకినయెడల ప్రత్యక్షమౌదువు
పూర్ణ మనస్సుతో నిను సేవించెదను
నిను ప్రేమించెదను - నీ రూపం పొందెదను
3. నశించిపోవును ఎపుడూ రాజుల సంకల్పములు
వ్యర్ధపరచెదవు నీవు అన్యుల ఆలోచనలు
శరణాగతులకు ధైర్యమిచ్చెదవు పూర్ణ మనస్సుతో నిను సేవించెదను
నిను ప్రేమించెదను - నీ రూపం పొందెదను


أحدث أقدم