Cheyyadhagina manchedhaina Lyrics


చెయ్యదగిన మంచేదైనా - చెయ్యకుండా వదిలిందైనా
చేయపూనుకో ఈ క్షణమైనా
గుర్తించు బాధ్యత నేడైనా - సాధించు ఆత్మలు కొన్నైనా
1. ఎదుటివాడు వెళ్తూ ఉన్న దారికి అడ్డంగా ఉన్న
రాయుని తొలగించకుంటే ఎలా
నీలో బలముండి కూడా మనసు లేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల
2. ఎదుటివాడు బాధలో ఉన్న హృదయవేదన కలిగున్నా
ఆప్యాయత చూపకుంటే ఎలా
ఆదరణ వాక్యమైన పలకలేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల
3. ఎదుటివాడు లేమిలో ఉన్న నీకు సమృద్ధిగా ఉన్నా
జాలిని చుపించకుంటే ఎలా
చిన్నపాటి త్యాగమైనా చేయలేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల
4. ఎదుటివాడు అన్యుడైయున్న నాశనమునకు పోతున్నా
భారం కలిగుండకుంటే ఎలా
సువార్తను కొందరికైనా పంచలేకపోతే ఎలా
తిరిగి రాదు అవకాశం మరల


أحدث أقدم