Rajadhi raja raaraa rajulaku rajuvai raaraa రాజాధి రాజా రారా రాజులకు రాజువై రారా

Song no: 236

రాజాధి రాజా రారా
రాజులకు రాజువై రారా
రాజ యేసు రాజ్యమేలా రారా
రవి కోటి తేజ యేసు రారా

1. ఓ ... మేఘ వాహనంబు మీద వేగమే
ఓ .. మించు వైభ్వంబుతోడ వేఘమే
ఓ .. భూజనంబులెల్ల తేరి చూడగా
ఓ ... నీ జనంబు స్వాగాతంబు నీయగా
నీ రాజ్యస్థాపనంబు సేయ
భూ రాజులెల్ల గూలిపోవ
భూమి యాకసంబు మరి పోవ
నీ మహా ప్రభావమున వేగ

2. ఆ ...ఆకసమున దూత లార్భ టింపగా
ఆ ... ఆదిభాక్త సంఘసమేతంబుగా
ఆకసంబు మధ్యవీధిలోన
ఏకమై మహా సభజేయ
యేసు నాధ నీదు మహిమలోన
మాకదే మహానందమౌగా

3. ఓ..పరమ యెరుషలేము పుణ్య సంఘమా
ఓ..గోరియపిల్ల క్రీస్తు పుణ్య సంఘమా
పరమ దూతలార / భక్తులారా /
పౌలపోస్తులార / పెద్దలారా /
గోరియ పిల్ల యేసు రాజు పేర
క్రొత్త గీతమేత్తి పాడ రారా ॥రాజాధి॥

                                                          ఈ.డి.నిత్యానందము

أحدث أقدم