nee krupa leni skhanamu nee dhaya leni skhanamu Lyrics




యేసయ్య ... నీ కృప నాకు చాలయ్య
నీ లేనిదే నే ... బ్రతుకలేనయ్య

నీ కృపలేని క్షణము  నీ దయలేని క్షణము
నేనూహించలేను యేసయ్య ...... "2"
పల్లవి :- యేసయ్య నీకృప నాకు చాలయ్య
నీ కృపలేనిదే నేనుండలేనయ్య ....... 2

మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి
మార్గముగా మారి మనిషిగా మార్చావు
మహినే నీవు మాధుర్యముగ మార్చి
మాదిరి చూపి మరు రూపమిచ్చావు "2"
మహిమలో నేను మహిమను పొంద 
మహిమగా మార్చింది - నీ కృప     "2"   యేసయ్య

ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి 
ఆపత్కాలమున ఆదుకున్నావు 
ఆత్మీయులతో ఆనందిప చేసి 
ఆనంద తైలముతో అభిషేకించావు 
నా ... ఆశ తీర ఆరాధన చేసె   
అదృష్టమిచ్చింది - నీ కృప   "2"   యేసయ్య


Post a Comment

أحدث أقدم