Ienthaga hecchinchutaku yenthati vadanu lyrics ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను

ఇంతగా హెచ్చించుటకు ఎంతటి వాడను
ఇంతగా హెచ్చించుటకు ఎంతటివాడను
వింతైన నీ ప్రేమ చూపుటకు ఏపాటివాడను
నేను ఏపాటి వాడను
నా కుటుంబము ఎన్నికలేనిది        }
నాదు జీవితం బహు స్వల్పమైనది }॥2॥
ఈలాంటి నన్ను ప్రేమించి చేరదీసావు
నా హీనస్థితిని విడిపించి నా పాటవైనావు॥ ఇంతగా॥
              1॰
అడిగినవన్నీ ఆక్షణమందే అనుగ్రహించావు   }
అనురాగంతో ఆనందముతో ఆశీర్వదించావు }॥2॥
నీ నామం నా గానం ప్రతీక్షణం ప్రమోదం
నీ సాటి నీవే సుమా ॥2॥               ॥ఇంతగా॥
               2॰
తలంపు నాలో పుట్టక మునుపే   }
హృదయము నెరిగితివి              }
తనివి తీరగ తనువును నాకై       }॥2॥
అర్పణ చేసితివి                        }
నీ త్యాగం నా భాగ్యం నీ తేజం వివేకం
నా గానం నీవు సుమా ॥2॥            ॥ఇంతగా॥

Post a Comment

أحدث أقدم