వందనమో వందనమన్న మా అన్న యేసన్నా
పరిశుద్దలవందనమన్న, దేవదూతల వందనమన్న, దేశనాయకుల
వందనమన్న, పంచభూతముల వందన మన్న, ప్రపంచ ప్రజల
వందనమన్న జీవరాసుల వందనమన్న …. అరెరె… హా
క్రైస్తవుల వందన మన్న మా అన్న యేసన్న
1. భూలోకంలో పాడు బ్రతుకులు, చెలరేగిన వ్యభిచారి
బ్రతుకులు
కుములుచున్న రోగుల బ్రతుకులు, అపవాదితో షికారు
బ్రతుకులు
చెరచబడ్డ ఆ బ్రతుకులు ఆయె, ఆత్మ రోగులకు
మందులు లేవు
అరెరె… హా.. మా ఆత్మల రక్షణ నీవన్న మా అన్న యేసన్న
2) భూకంపాలు వస్తయన్నవు భవిషత్ జ్ఞానం నెరవేరింది.
భవంతులన్ని
నేలమట్టమై లక్షల ప్రజల అవితులు బాసిరి, భూగర్భలను
పరిశోధించిరి
శాస్త్రవేత్తలు తల్లక్రిందులై మాడిపోయిరి
అరెరె… హా నీవు పలికినవన్ని చరిత్రపుటలే మా అన్న యేసన్న
3) వందల వేల సంవత్సరాల చరిత్ర గలది సత్యవేదమను బైబిలు
గ్రంధం, మానవులందరి జీవగ్రంధము, యేసే మార్గం
యేసే జీవ త్యాగశీలుకు త్యాగశీలవై సమాధి గెలిచిన
మృత్యంజయుడు అరెరె….. హా. నీవు చేసినవన్ని
యదార్ధగాధలె మా అన్న ఏసన్నా
إرسال تعليق