నా శక్తి యుక్తితో ఇది సాధ్యపడదే }2
ఈ ఘనతంతా యేసూ నీదే }2
అ:ప. : కరుణించి నీవే క్రియ చేసినావే ప్రియుడా నా యజమానుడవే }2 || నీ దీవెనలవల్లనే ||
1. నేను చేరలేని ఉన్నత స్థానములు అధిరోహించగజేసితివే }2
త్రోయబడ్డ నన్ను స్వీకరించి
వేలమందికొరకు ఎన్నుకుంటివే }2 || కరుణించి ||
2. నేను చూడలేని నూతన సంగతులు సందర్శించగజేసితివే }2
భంగపడ్డ నన్ను ఆదరించి
నిందతీసి ఘనతనిచ్చియుంటివే }2 || కరుణించి ||
3. నేను మోయలేని విస్తృత బాధ్యతలు నిర్వర్తించగ జేసితివే }2
కూలబడ్డ నన్ను ప్రోత్సహించి
పూనుకున్న పనిలో తోడుగుంటివే || కరుణించి ||
إرسال تعليق