నా హృదయం అర్పించి నిను

    నా హృదయం అర్పించి నిను ఆరాధింతును (2)
    సార్వభౌముడ నీ సన్నిధిలో (2)
    ఆరాధనా ఆరాధనా
    సర్వ సత్య వంతుడా ఆరాధనా (2) || నా హృదయం ||

  1. అదృశ్య దేవుని రూపుడవు నీవేనయ్యా
    సర్వ సృష్టికి మూలాధారం నీవేనయ్యా (2)
    మొదటి వాడవు కడపటి వాడవు (2)
    కలిగియున్నవి ఏవైనా నీవాలనే కలిగెను (2)
    ఆరాధనా ఆరాధనా
    సర్వ సత్య వంతుడా ఆరాధనా || నా హృదయం ||

  2. ఉన్నవాడవు అను వాడవు నీవేనయ్యా
    సజీవులకు దేవుడవు నీవేనయ్యా (2)
    సర్వోన్నతుడా సర్వ శక్తివంతుడా (2)
    సకలాశీర్వాదములు అన్నియూ నీ వలనే కలుగును (2)
    ఆరాధనా ఆరాధనా
    సర్వ సత్య వంతుడా ఆరాధనా || నా హృదయం ||

  3. శాంతి ప్రదాతవు షాలేము రాజువు నీవేనయ్యా సర్వ రోగములు తొలగించే దేవుడా నీవేనయ్యా (2) పరమ వైద్యుడా నా ప్రాణ నాథుడా (2) శాంతి సమాధానములు నీవాలనే కలుగును (2) ఆరాధనా ఆరాధనా సర్వ సత్య వంతుడా ఆరాధనా || నా హృదయం ||

ليست هناك تعليقات:

يتم التشغيل بواسطة Blogger.