నీ దీర్ఘశాంతమే నా హృదయానికి

    నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము
    నీ కరుణా కటాక్షములే నా బ్రతుకుకు ఆధారము (2)
    యేసయ్యా… కనిపించరే
    నీలాగా ప్రేమించే వారెవరు (2) || నీ దీర్ఘ ||

  1. కడుపేద స్థితిలోనే కరువే నా బంధువాయెను
    వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే కృంగదీసెను (2)
    (ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో
    ఐశ్వర్యవంతుడ నన్నాదుకున్నావు (2)
    యేసయ్యా… కనిపించరే
    నీలాగా దీవించే వారెవరు (2) || నీ దీర్ఘ ||

  2. ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని
    ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని (2)
    తృణీకరింపబడిన నా బ్రతుకును
    కరుణా సంపన్నుడా నన్నెన్నుకున్నావు (2)
    యేసయ్యా… కనిపించరే
    నీలాగా కృప చూపే వారెవరు (2) || నీ దీర్ఘ ||

  3. నా ప్రాణము నాలో కృంగివున్న సమయములో
    జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను (2)
    మధురమైన నీ సహవాసముతో
    నా జీవ నాథుడా నీ మమతను పంచావు (2)
    యేసయ్యా… కనిపించరే
    నీలాంటి జీవము గల దేవుడెవ్వరు(2) || నీ దీర్ఘ ||

ليست هناك تعليقات:

يتم التشغيل بواسطة Blogger.