అనంతుడా ఆదరించే యేసయ్య

    అనంతుడా ఆదరించే యేసయ్య
    ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంకెవరూ వున్నారాయ

    అనురాగ నిలయుడా ఐశ్వర్యవంతుడా
    కనికర పూర్ణుడా నా యేసయ్య

    కష్టాల కొలిమిలో నీకిష్టమైన రూపు చేసి
    నీ చేతి స్పర్శ తో ప్రతి క్షణము నన్ను ఆదరించి
    మహిమ స్వరూపుడా నా చేయి విడువక
    అనురాగము నాపై చూపించుచున్నావు || అనురాగ ||

  1. శత్రువు పై సమరములో రథ సారథివై నడిపినావు
    నీ నియమాలను నేర్పించి శత్రువును ఓడించినావు
    విజయ సమరయోధుడా నాకు జయము నిచ్చి
    విజయోత్సవాలతో ఊరేగించుచున్నావు || అనురాగ ||

  2. విడువక నన్ను ప్రేమించే నిజ స్నేహితుడై నిలిచినావు
    నీ హస్త బలముతో అగాధాలు దాటించినావు
    నీ సన్నిధి కాంతిలో నన్ను తేజరిల్ల చేసి
    ఆనంద నగరికై సిద్ధపరచు చున్నావు || అనురాగ ||

ليست هناك تعليقات:

يتم التشغيل بواسطة Blogger.