95
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
ఆరు దినములలోపలనే యాకసము భూలోకములను ప్రాకటముగ జేసి నాడు ప్రకాశుడాయన ప్రజ్ఞవంతుడు ||యేసు||
ఆది పురుషుని యాదిస్త్రీనిక హస్తములతో నంటి చేసెను మేదినిన్ ఫలవనములో న సాధులై నివసింప నిచ్చెను ||యేసు||
వార లిద్దపు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడీ పిశాచ తంత్రము వారి పరమై పాపులైరి ||యేసు||
వీరలందఱు వారి సంతతి వేరెలేరీ ధరణిలో దు ష్యార్యులై దేవుని యాజ్ఞలు మీరి రందఱు నరక పాత్రులు ||యేసు||
ఇంత పాపభరితులై కా సంతసత్యము లేని నరుల నెంతగా బ్రేమించెనో తన సొంత ప్రాణము బలిగబెట్టెను ||యేసు||
పాపమించుకలేని కరుణా పావనుడు నరుడాయెను శాపగ్రస్తులమైన మన శాపములు తాజేత బూనెను ||యేసు||
ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము జిందెనిలను ఎన్నడు నీలాటి ప్రేమ వన్నెలేదో యన్నలారా ||యేసు||
మనల బాపమునుండి బాపను మనుజుడై మరణంబునొంది మన ప్రభువె మూడవ దినంబున మహినిలేచి పరము వెళ్లెను ||యేసు||
إرسال تعليق