90
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
సిలువ మోసిన నీ ప్రయాసను జెప్పుటకు నోరాడదు అలుకునొందక స్వామి నీ ది వ్యాంఘ్రి చెంతను గూడుదు ||క్రీస్తు||
నిమిషమైన ంబాయకెదలో నిన్ను నే స్మరియింతును అమితమౌ దేవా ను క్రోశము హర్షముగ వర్ణింతును ||క్రీస్తు||
యేసుప్రభు నా కాలమంతయు నేమఱక నీ నామము దాసునిగ భజియంతు నిక నే దప్పకుండను నీమము ||క్రీస్తు||
చచ్చి నే నరుదెంచి మోక్షము స్వామి నీ యుపకారముల్ హెచ్చు ప్రేమను బాడుచుందును యెప్పుడును గైవారముల్ ||క్రీస్తు||
మలినమౌ నా నత్తి నాల్క స మాధిలో గృశియింపను బలిమితోనే బాడుచుందును భక్తి యుజ్వలింపను ||క్రీస్తు||
కన్ను మూతలుగాను నీ సము ఖంబు కేను బిరాలను తెన్ను తప్పకవత్తు శ్రీకర దేవ నను నీవేలను ||క్రీస్తు||
ముగ్గురొకడై వెల్గుచుండెడి మోక్షరాజ్య గరిష్ఠుడా యొగ్గుచేయక నన్ను బ్రోవవే యేసునాధ మహేశుడా ||క్రీస్తు||
భూతలములో నీ సమానము బోల్చ నేదియు గానము దాతవై మము సలుపవే నీ తండ్రికిని సంధానము ||క్రీస్తు||
إرسال تعليق