a86

86

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఏమి నేను సమర్పింతు యేసూ యెట్లు నిన్ను స్తుతియింతు ఏమి సమర్పింతు హీనుడ నగు నేను గామితార్థము లెల్ల గలుగజేయు నీకు ||నేమి||

  1. నేను మార్గము దప్పియుండగ నన్ను నీవు కంటివి కరుణ నిండగ దీనపాపులను దృఢముగ బ్రోవను దాన మిచ్చితివి తనర నీ ప్రాణము ||నేమి||

  2. అందరి కొఱ కీవు తెచ్చిన మిగుల అందమైన నిత్య రక్షణ అంది నిన్ను వినతి పొందుగ జేసెద నొందు మా నా నుతి నుత్తమ ప్రభు క్రీస్తు ||ఏమి||

  3. నీ యందే యానంద మొదగ యేసు నీదైన యాత్మ నాకందగ జేయు మంచు నీకు జేసెద బ్రార్థన నాయందు దయచేసి నా మనవి నాలించు ||మేమి||

  4. నేను జేసిన యఘము లెల్లను గర్త నీ యెదుట దలంచు కొందును నేను సిగ్గు నొంది నిజముగ గుందుచు నేను వేడుకొందు నీ క్షమాపణ కొరకు ||నేమి||

  5. నన్ను నీవు స్థిరపరచుము కర్త యన్నిట నను బలపరుచుము తిన్నని మార్గమున దృఢముగ నేగుచు నిన్ను నే స్తుతియింతు నిండుగ నెల్లప్పు ||డేమి||

Post a Comment

أحدث أقدم