a7

7

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో కన్నతండ్రి కావుమా కలుషము నెడబాపుమా||

  1. నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా పాతకజన రక్షకా పతితపావన నామకా|మానవ సంరక్షకా దీన నిచయ పోషకా దేవమానవ నందనా దివ్య సుగుణ మందనా||

  2. ప్రేమ తత్వభోధకా క్షేమదాత వీవెగా కామిత ఫలదాయక స్వామి యేసు నాయక||

  3. పాపచింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో నీ పవిత్ర నామమున్ నిరతము స్మరియించెదన్||

Post a Comment

أحدث أقدم