a67

67

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శాశ్వతుడా! విస్మయమొంది నేను నీ స్వంతహస్త సృష్టిజూడగా నీ స్వరం విందున్ ఉరుములయందు యేసు ప్రభూ నిన్నారాధింతును ||ఓ రక్షకా! నీ స్తుతి పాడెదన్ నూరంతలన్ మహాదేవా నా రక్షకా! నమస్కరింతునిన్ మారని యో మహాదేవా||

  1. వృక్షంబులందున్, అడవులలోనే పక్షుల పాటలాలకింతును తక్షణ మగ్రపర్వతంబు నుండి అక్షులతో నీ మహిమ గందున్.మహాదేవా! నీయేక పుత్రుండిలన్ నా హేయపాపముల్ భరించి, నా సహాయుడై తా మరణించె నంచు ఓహో! యాశ్చర్యపడి స్మరింతున్.క్రీస్తు విజయార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను జేర్చగా నే స్థిరతుష్టితో సాష్టాంగపడి నీ స్తుతి జేతునో మహాదేవా.

Post a Comment

أحدث أقدم