52
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా ప్రభువా గావుము గావుము నీ నీడన్||
చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించున్||
చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా చెన్నుగ యేసూగావుమా||
నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్||
రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ నిద్రించెదము మాదేవా||
తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగలేచి నుతియింపన్ మేల్కొల్పుము నా ప్రియతండ్రి||
జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు అనిశము నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్||
إرسال تعليق