a478

478

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    విసుకదే ప్రాణంబు విజ్ఞాని కిలను పొసగు వైరాగ్యంబు పుట్టదే తలను అసదు గానట్టి కష్టానుభవమే గాని యసదృశానంద ఫల మొసగు నది యేది ||విసుకదే||

  1. మును పేది యుండెనో వెనుక నదియే యుండు మునుపు వెనుకకు మధ్య మున నున్న దదియే నొనరంగ గ్రొత్తయై యుత్పన్నమగు నట్టి ఘనకార్య మొక్కటియు గానంగరాదు ||విసుకదే||

  2. ధరణి మీదికి దిగం బరుబగుచు నేతించు మరణ మప్పుడు దిగం బరుడగుచు బోవున్ నర్రుడు పుట్టినడు సరెకెద్దియును తేడు మరణమగు నాడొక్క సరకుగొనిపోడు ||విసుకదే||

  3. ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచు సకల వంశము లిట్లు సమసిపోవుచుండు నిక వారి పేర్పింపు లెచ్చోట నేమాయె నొకండైన చెప్పుటకు నుర్విలో లేడు ||విసుకదే||

  4. ఏటివంకలు దీర్చ నెవ్వాని కలవి ము న్నీటి మూకుడు సేయ నేర్పరి యెవండు మోటైన మనసు వం పులు దీర్చు గురు వెవడు కోటి ధనమిచ్చినను కుంభినిని లేడు ||విసుకదే||

  5. ధరణిలో నరరూపు దాల్చి పాపుల కొఱకు మరణమై లేచు స ద్గురు డైన యేసు చరణాబ్జముల సేవ సారమిది యొక్కటే పరమ ఫలమిడు సుఖ ప్రాప్తి యొనరించున్ ||విసుకదే||

Post a Comment

أحدث أقدم