a477

477

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుగొన్న లేదు సుఖ మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున చొరకున్న లేదు సుఖ మెచట ||నేది||

  1. కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక ||నేది||

  2. కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నే గోర నిచట గులాబి కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మున జేరి భూరిసుఖ మొందెద వి చార మిక నేల ||నేది||

  3. యేసుప్రియ మించు కే నెఱిగి కన్గొను వేళ నా సంతసము నిండు పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిది దళ తళలాడ జేసె నా కన్నీళ్లు చింత లెడబాపి ||యేది||

  4. ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు బైకి రా గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకు దండ్రితో గడియ సే పుండినను జాలు ||నేది||

  5. నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింప బదుదునని పాడి చని పరమసుఖి నౌదు ||నేది||

Post a Comment

أحدث أقدم