473
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- చెడ్డ తలపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిక ||వద్దు||
- నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ యందు వెలు గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో ||వద్దు||
- ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చన జేసి నను మోసి కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిక ||వద్దు||
- బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు యేసుండు నీ యండ నుండగ నీ గుండె దిగు లేల యిక ||వద్దు||
- పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగ జుట్టుకొను కష్టముల బిట్టు విడగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిక ||వద్దు||
- మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు ర్భావము ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిక ||వద్దు||
إرسال تعليق