448
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- బలహీనులము మేము బలవంతుడవు నీవు బల మిచ్చి మము నడుపుము ఇలను మే మిక బ్రతుకు దివనం బులను నీ పద భక్తిచే నెపుడలయ కుండగ మమ్ము గడు ని ర్మలిన హృదయుల జేసి కరుణను ||కొనుము||
- ఘోరారణ్యము భువి వి చార సంకలితము భూరి భయంకరము దారి లేదిక నీవు దప్ప వేరె సాధన మెచెట గానము కోరి మము నందరిని నీదరి జేరుకొను మార్గమును జూపు ||కొనుము||
- గత వత్సరమున నీ యతులమౌ కృపచేత పతితుల మము గాచితి వతి వినమ్రుల మగుచు మామా మతులలో నీ ప్రేమ దలచుచు మతి విహీనతే వీడి యిక నిను సతతతము సేవింతు మయ్య ||కొనుము||
- ఈ వత్సరంబున నెవ్వరు మాలోన పోవుదు రిలను విడిచి దేవ వారలు భువిని వదలి పోవు కాలమునందు దిన్నని త్రోవలో వారలను సుఖముగ బ్రోవ దొడ్కొని పోవు మయ్య ||కొనుము||
- మమ్మును విశ్వాస మార్గమందున దోడ నిమ్ముగ గొని పోవుచు నమ్ము నీ ప్రియ సేవకుల బృం దమ్మునకు సిద్ధంబులగు మకు టమ్ములను మే మొందుటకు వే గమ్ముగా బాత్రులను జేసి ||కొనుము||
- శోధనల యందున బాధల యందున న
إرسال تعليق