412
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- ఆయన భూమ్యాకాశము లన్నిటను సృజించెగా యాయన యిక దొట్రిల్ల నీయడు నీ పాదము ||గొండల||
- నిన్ను గాపాడు వా డెన్నడును గున్కడు పన్ను గ నిశ్రాయేల్ గా పాడు వాడు కున్కడు ||కొండల||
- నీకు యెహోవాయే నిజముగా గాపగు నీ కుడిప్రక్కను బ్రభుం డు నీకు నీడగా నగు ||కొండల||
- ధాత్రి బగు లెండ దెబ్బ రాత్రి వెన్నల దెబ్బయే మాత్ర మైనను నిన్ను మార్కొనంగ జాలవు ||కొండల||
- ఏ యపాయమును రా నీయకుండ నా యెహోవ పాయక నిను గాచును నీ ప్రాణము గాపాడును ||కొండల||
- మోదంబుతో నిది మొదలుకొని నిత్యమున్ నీదు రాక పోకలందు నిను యెహోవా కాచును ||కొండల||
- జనక కుమారాత్మకును ఘనత మహిమ కల్గును మును పిపుడెల్లప్పుడు యుగ ముల కగు గా కామేన్ ||కొండల||
إرسال تعليق