411
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- బాటసారి లాగు నేడు భానుడు గ్రుంకి మేటి చీకటి గ్రమ్మినన్ నేటి విశ్రాంతికి జోటు బండయైనన్ మాటిమాటికి గలలో సూటిగా నినుదలతు ||ఓ దేవ||
- ఆకాశ మండల మార్గంబు నెప్పుడు నా కీవు చూపించుమా నీ కూర్మిచే నాకు జేకూరు నంతయు లోకేశ్వర దూత లే కోరి నను బిలువ ||ఓ దేవ||
- నీకు స్తోత్రము చేసి యపుడు నా మదిలోని ప్రాకటంబగు నెనరుతో భీకరము లైన శోకంబు లను రాళ్లన్ నీకు నాలయంబు నేగట్టె దను గర్తా ||ఓ దేవ||
- సంతసంపు రెక్క లెత్తి నాకమునందు నెంత పైకి లేచినన్ వింతగ జ్యోతుల వితతి మించి నేన త్యంత మెగసినను నీ చెంత కేగును బాట ||ఓ దేవ||
إرسال تعليق