30
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
భూనరులన్ రక్షింప బూనుకొనినప్పుడు దీన కన్యాగర్భమున్ దిరస్కరింపలేదుగా ఓ క్రీస్తూ||
విజయము మరణపు వేదనపై నొందగా విశ్వాసులందరికిన్ విప్పితివి మోక్షమున్ ఓ క్రీస్తూ||
నీవు తండ్రిదైనట్టి నిత్య మహిమయందు దేవుని కుడివైపు దిరముగా గూర్చున్నావు ఓ క్రీస్తూ||
నీవు న్యాయాధిపతివై నిశ్చయముగా వఛ్ఛెదవు కావున నీ సాయంబుకానిమ్ము నీ దాసులకు ఓ క్రీస్తూ||
దివ్యమౌ రక్తంబు చిందించి నీవు రక్షించిన సేవకులకై మేముచేయు మనవి నాలించు ఓ క్రీస్తూ||
నీ వారి నెల్లప్పుడును నిత్య మహిమయందు నీ పరిశుద్ధులతోను నీ వెంచుకొను మయ్య ఓ క్రీస్తూ||
నీదు జనమున్ రక్షించి నీ దాయము దీవించుము నాధా వారలను నేలి లేవనెత్తు మెప్పుడును ఓ క్రీస్తూ|
నేడు పాపము చేయకుండ నెనరుతో మము గావుమయ్యా పాడెడి నీ దాసులకు బరమ దయ నిమ్మయ్య ఓ క్రీస్తూ||
ప్రభువా కరుణించుము ప్రభువా కరుణించుము ప్రార్థించు నీ దాసులపై వ్రాలనిమ్ము దీవెనలన్ ఓ క్రీస్తూ||
నిన్ను నమ్మి యున్నాము నీ కృప మాపై జూపుము మేము మోసపోకుండ నీవే కాపాడుమయ్యా ఓ క్రీస్తూ||
إرسال تعليق