28
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
నిన్ను స్తోత్రించుచు నిన్ను బూజించుచు నిన్ను మహిమపర్చుచున్నాము లోక ప్రభో ||మహిమ||
ప్రభువైన దేవుండా పరమండలపు రాజా ప్రబలంబు గల తండ్రి పరిశుద్ధంబగు ప్రభో ||మహిమ||
వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి వినుతింతుము సత్ర్వభో ||మహిమ||
జనితైక పుత్రుడగు ఘన క్రీస్తేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల జనకుని కుమారుడ ప్రభో ||మహిమ||
ధర పాపములమోయు వరపుణ్య శీలుండా కరుణించి మా బీద మొరలాలించుము ప్రభో ||మహిమ||
తండ్రియైన దేవుని దక్షిణ్ భాగమున గూర్చుండి యున్నావు కృపజూపుమి సత్ర్పభో ||మహిమ||
పరిశుద్ధుడవు నీవే పరమ ప్రభుడవు నీవే దురితాత్ములను గాన మరణంబైతివి ప్రభో ||మహిమ||
పరమ జనకుని మహిమన్ పరిశుద్దాత్మైక్యంబై సరణి మాకై యున్న సర్వోన్నత ప్రభో ||మహిమ||
إرسال تعليق