చింత లేదిక యేసు పుట్టెను

    1

    రాగం - కాంభోజి తాళం - ఆది

    చింత లేదిక యేసు పుట్టెను వింతగను బెత్లేహమందున
    చెంత జేరను రండి సర్వ జనాంగమా సంతసమొందుమా } 2 || చింత లేదిక ||

  1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా
    ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి స్తుతులొనరించిరి || చింత లేదిక ||

  2. చుక్క గనుగొని జ్ఞానులేంతో మక్కువతో నా ప్రభుని కనుగొన
    చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి కానుకలిచ్చిరి || చింత లేదిక ||

  3. కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు
    ధన్యులగుటకు రండి వేగమే దీనులై సర్వ మాన్యులై || చింత లేదిక ||

  4. పాపమెల్లను పరిహరింపను పరమ రక్షకుడవతరించెను
    దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము మోక్ష భాగ్యము || చింత లేదిక ||


    Chintha Ledika Yesu Puttenu Vinthaganu Bethlehamanduna
    Chentha Jeranu Randi Sarva Janaangamaa Santhasamondumaa } 2|| Chintha Ledika ||

  1. Dootha Thelpenu Gollalaku Shubhavaartha Naa Divasambu Vinthagaa
    Khyaathi Meeraga Vaaru Yesunu Gaanchiri Sthuthulonarinchiri || Chintha Ledika ||

  2. Chukka Ganugoni Gnaanulentho Makkuvatho Naa Prabhuni Kanugona
    Chakkagaa Bethlehe Puramuna Jochchiri Kaanukalichchiri || Chintha Ledika ||

  3. Kanya Garbhamunandu Puttenu Karunagala Rakshakudu Kreesthudu
    Dhanyulagutaku Randi Vegame Deenulai Sarva Maanyulai || Chintha Ledika ||

  4. Paapamellanu Pariharimpanu Parama Rakshakudavatharinchenu
    Daapu Jerina Vaarikidu Gudu Bhaagyamu Moksha Bhaagyamu || Chintha Ledika ||

Post a Comment

أحدث أقدم