అయ్యో యిది యెంత దుఃఖము

రాగం - కాంభోజి తాళం - ఆది

    అయ్యో యిది యెంత దుఃఖము ప్రభు తీర్పువేళ నయ్యో యిది యెంత దుఃఖము చయ్యన యెహోవా సింహా సనము చుట్టు వహ్ని మండు నయ్యెడ విశ్వాసులకు దు రాత్మల కగు నిత్య ఖేద ||మయ్యో||

  1. తల్లి పిల్లలు గూడుదు రచట దండ్రి తాత లచట గలియుదు రెల్ల కాల మటుల నుండ కెడబడి మరి యెపుడు చూడ ||రయ్యో||

  2. అన్నదమ్ములచట గూడుదురు రక్క సెలియలందు గలియుదు రెన్న డు మరి చూడ రాని యెడగల స్థలములకు బోదు ||రయ్యో||

  3. భార్యాభర్తలు గూడుదురు రచట బంధు మిత్రులు కలియుదురు రందు కార్య భేదమువలన సర్వ కాలము మరి కూడజాల ||రయ్యో||

  4. క్రీస్తు మత ప్రబోధకులు స మస్త శిష్యులు కూడుదు రచట వాస్తవ స్థితు లెరుగబడిన వలనను విడబడుదు రంద ||రయ్యో||

  5. శిష్టులు దుష్టులు కూడుదు రచట స్నేహవంతు లందు గలియుదు రిష్టము గాని భిన్నులగుచు నిక మరి యెన్నటికి గూడ ||రయ్యో||

  6. అల పిశాచి పాపు లందరు నడుపు కర్తకు భిన్ను లగుచు పలుగొరుకుల నిత్య నరక బాధల పాల్బడక పోరు ||అయ్యో||

  7. సాధు సజ్జనంబు లెల్ల సకల దూతలతోడ గూడి మోదముతో ప్రభుని వెంట ముక్తి కేగి నిత్యులగుదు రాహా యిది యెంత విజయము ప్రభు తీర్పు వేళ నాహా యిది యెంత విజయము ||అయ్యో||

    ✍ పురుషోత్తము చౌధరి


    Ayyo Yidhi Yentha Dhukkamu – Prabhu Theerpu Vela – Nayyoa Yidhi Yentha Dhukkamu = Chayyana Yohoavaa Simhaa –Sanamu Chuttu Vahni Mandu – Nayyeda Visvaasulaku Dhu- Raathmala Kagu Nithya Khedhamu || Ayyo ||

  1. Thalee Pillalu Guududhu Rachata – Thandri Thaatha Lachata Kaliyudhu Rella Kaala Matulanunda – Kedabadi Mari Yepudu Chuudaru || Ayyo ||

  2. Anna Dhammu Lachata – Kuududhuru Akka Seliya Landhu Kaliyudhu – Rennadu Marichuuda Raani – Yedagala Sthalamulaku Boadhuru || Ayyo ||

  3. Bhaaryaa Bharthalu Guududhu Rachata – Bandhu Mithrulu Kaliyudhuru Randhu = Kaaryabhedhamu Valana Sarva – Kaalamu Mari Kuuda Jaalaru Ayyoa Yidhi Yentha || Ayyo ||

    ✍ Purushotthamu Choudhary

Post a Comment

أحدث أقدم