యేసు చాలును యేసు చాలును

671

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    యేసు చాలును యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలునుపరమజీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును ||యేసు||

  1. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను ||యేసు||

  2. పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ లోయలో నన్ను కాపాడును ||యేసు||

  3. నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను ||యేసు||

Post a Comment

أحدث أقدم