దేవదేవుని గొప్ప పురము

510

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవదేవుని గొప్ప పురము పరలోకానందముక్రైస్తవ జీవితము యా పురము ||దేవ||

  1. దేవుని పురము దేదీప్య కరము జీవ మందిరము జేగీయ గృహము ||దేవ||

  2. పరిశుద్ధ పురము పరమార్థ కరము పరమ మందిరము పరదైసు పురము ||దేవ||

  3. ఆనంద పురము ఆది నిరంతరము కాన దుస్తరము ఘన మనోహరము ||దేవ||

  4. శృంగార పురము సుర చిర కరము బంగారు మెరము ప్రభల భాసురము ||దేవ||

  5. వైభవ పురము వంద్య మప్పురము సౌభాగ్య కరము స్ఫటిక మందిరము ||దేవ||

  6. కెంపు పాండురము కీర్తి బంధురము ఇంపౌ నగరము ఇదియే సుస్థిరము ||దేవ||

  7. క్షుదలేని పురము సుక్షేమ కరము ముదము విస్తరము రొదలు దుస్తరము ||దేవ||

  8. ఆశ్చర్య పురము ఆశ్రయ కరము నిశ్చయపరము నిజదేవ పురము ||దేవ||

  9. మాణిక్య పురము మణుల గోపురము వీణెలు స్వరము విన మనోహరము ||దేవ||

  10. సూర్యభాసురము చొరనట్టి పురము కార్య మబ్బురము గావించు గరము ||దేవ||

  11. సీయోను పురము శ్రేయస్సాగరము మాయ విధురము మరి సంపత్కరము ||దేవ||

  12. ఇచ్చు నిబ్బరము యెరుషలేం పురము మెచ్చౌ నబ్బురము మెరయు మా పురము ||దేవ||

Post a Comment

أحدث أقدم