శృంగార దేశము చేరగానే

513

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియు బోవున్ యేసుని యొద్దను నిత్యమునే నుండుట మిక్కిలి యాశ్చర్యము ||ఇదే నాకు ఆనందము ఆనందము, ఆనందము నేను ఆయనను జూచుటయే ఇదే నాకు బరమానందము||

  1. అమితమైన కృపవలన నన్ను స్వర్గంబున జేర్చుదురు అచ్చోటనుండి యేసుని గాంచి స్తుతి కీర్తనలు పాడుదును.నేను ప్రేమించు స్నేహితులును అక్కడ జూచి సంతోషింతును నాయేసు ముఖము చూచుటయే నిత్యము నాకది యానందము.ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు కండ్లతో జూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు నాత్మతో జూచి సంతోషింతును

Post a Comment

أحدث أقدم