518
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- అనుదినంబును ప్రభుని దలచుచు అలయకను ప్రార్థింతుము అనవరత మా ప్రభుని చిత్తము ననుకరింతుము పనులలో ||
- వేదవాక్య పఠనమందు విసుగు జెందక నుందుము ఆదరంబున దైవ చిత్తము ననుసరించుచు నడుతుము||
- ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక విసుకు జెందక నాలయమునకు పిన్న పెద్దల దెత్తుము ||
- సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రతీతో భంగ పరచెడి పనులన్నిటి కృంగదీసెదమనిశము ||
- ప్రేమతోడను పొరుగువారిని ప్రియులుగను భావింతుము క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ శాంతితో జీవింతుము ||
- శక్తిగొలది శరీరబలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము భక్తితో హృదయమును పూర్తిగ ప్రభునికే యర్పింతుము ||
- చిన్నవారలు దైవరాజ్యపు చిఱుత వారసులంచును అన్నివేళల వారి వృద్ధికి మిన్నగ దోడ్పడెదము ||
- పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోడను జూపుచు ||
- జీవితంబున ప్రభుని ప్రేమా శ్శీసులను ప్రసరింతుము దివ్యజ్యోతుల రీతి వెలుగుచు దివ్యసన్న
إرسال تعليق