కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిదారీ

645

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    కుమ్మరీ ఓ కుమ్మరీ జగదుత్పత్తిదారీ జిగటమన్నై నా వంక చల్లగ చూడుమయ్యా......పనికిరాని పాత్రనని పారవేయకుమా పొంగిపొరలు పాత్రగా జేసి నన్ను నింపుమా సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసున్ పొగడుచుండ సాక్షిగ నుండు పాత్రగజేసి సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరీ||

  1. విలువలేని పాత్రన్ నేను కొనువారు లెరెవ్వరూ వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగజేసి ఆటంకములనుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా ||కుమ్మరీ||

  2. లోకాశతో నింజి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిన్ మనుష్యేచ్చలన్నియున్ స్థిరమనుచు నే మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నను పట్టితీ ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ నే పట్టితిన్ ||కుమ్మరీ||

Post a Comment

أحدث أقدم