చూడుము గెత్సెమనే

651

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    చూడుము గెత్సెమనే తోటలో నా ప్రభువు పాపి నాకై వి జ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నది పాపి నీకై విజ్ఞాపన చేసెడి ధ్వని వినబడుచున్నదిదేహమంతయు నలగి శోకము చెందినవాడై దేవాది దేవుని ఏకైక సుతుడు పడు వేదనలు నా కొరకే||

  1. తండ్రి ఈ పాత్ర తొలగున్ నీ చిత్తమైన యెడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివనెను||

  2. రక్తపు చెమట వలన మిక్కిలి బాధనొంది రక్షకుడేసు హృదయము పగులుగ విజ్ఞాపనము చేసెనే||

  3. ముమ్మారు భూమిమీదపడి మిక్కిలి వేదనచే మన యేసు ప్రభువు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే||

  4. ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి ప్రభువు వేదన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసెను||

  5. నన్ను తనవలె మార్చెడి ఈ మహా ప్రేమను తలచి తలచి హృదయము కరుగగ సదా కీర్తించెదను ||చూడు||

Post a Comment

أحدث أقدم