పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని

504

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని విన బడు పుర మదిగో పద పదరే ప్రియులారా పరమేశ్వరుని చేత బరిపాలనము గల్గి చిరమై భాసురమై సు స్థిరమై సుందరమైన ||పరిశుద్ధి||

  1. రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప చ్ఛవితోను దాని కవ సర మింతలేదు అవిరతమున గ్రీస్తు డందుండు ప్రభతో సం స్తవమై వైభవమై యు త్సవమై వెల్గుచు నుండు ||పరిశుద్ధి||

  2. గొదయైన మఱియే యా పదయైన దగయైన మొదలే లేకుండు న ప్పుర వాసు లందు మృదు జీవోదకము ల ర్మిలి నిరంతర మిచ్చు గుదురుగ నెదురుగ గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి||

  3. ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి శుభమైన నది యుండి సుఖమిచ్చు నచట నుభయ తీరములందు నుండు వృక్షములు సౌ రభదీప్త శుభములై రక్షా ఫలము లిచ్చు ||పరిశుద్ధి||

  4. జననంబు మరణంబు సంసార సుఖబాధ లనుభవించుట గల్గ దా పురమునందు మును నీతి కొఱ కాప దను బొందు తనవారి కనునీ ళ్లన్నియు దుడుచు మన దేవు డందుండి ||పరిశుద్ధి||

  5. వెలకంద రాని ని శ్చలమైన ఘన జీవ విలపత్కిరీటము ల్గల వప్పుర మున బిలిచి నప్పుడె విభుని పెండ్లి విందున కేగు కుల బంధువులకు ని చ్ఛల నిచ్చు దేవుడు ||పరిశుద్ధి||

    ✍ పురుషోత్తము చౌధరి

      Parisuddhi Parisuddhi- Parisudhdhi Yani Vinabadu Pura Madhigoa-Padha Padhare Priyulaaraa= Paramesvaruni Chetha –Pari Paalanamu Kaligi-Chiramai Baasuramaisusthitamai Sundharamaina || Parishuddhi ||

    1. Ravi Thoanu Kumudhabaam-Dhavu Thoanu Mari Dheepa-Chchavithoanu Dhaani Kavasara Mintha Ledhu = Avirathamuna Kreesthu-Dandhundu Prabhathoa Samsthavamai Vaibhavamai Yu-Thsavamai Velguchu Nundu || Parishuddhi ||

    2. Godhayaina Mari Ye Yaa-Padhayaina Dhaga Yaina – Modhale Lekundu Nappura Vaasu Landhu= Mrudhu Jeevoadhakamu La –Rmili Niranthara Michchu-Gudhuruga Nedhuruga – Kuurchundi Yuva Raaju || Parishuddhi ||

    3. Prabhu Krupaasanamuloa Palinundi Pravahinchi –Subha Maina Nadhi Yundi Sukhamichchu Nachatan= Vubhaya Theeramulandhu – Nundu Vrukshamulu Sou- Rabha Dheeptha Subhamulai – Rakshaa Phalamu Lichu || Parishuddhi ||

    4. Jananambu Maranambu -Samsaara Sukha Baadha – Lanubhavinchuta Kaluga –Dhaapuramunandhu = Munu Neethi Kora Kaapa –Dhanu Bondhu Thanavaari- Kanu Neellanniyu Thuduchu – Mana Dhevu Dandhundi || Parishuddhi ||

    5. Velakandha Raani Ni-Schalamaina Ghana Jeeva –Vila Pathkireetamu-Lugalavu Aapuramuna= Pilichi Nappude Vibhuni – Pendli Vindhuna Kegu – Kula Bhandhuvu Lakun- Ichchala Nichuchu Dhevudu || Parishuddhi ||

      ✍ Purushotthamu Choudhary

Post a Comment

أحدث أقدم