నా సంకటంబులన్నియు

668

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    నా సంకటంబులన్నియు తీరిపోయె సంహారరదూత నన్ను దాటిపోయెగొఱ్ఱెపిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ బొందితిన్ ||నా సంక||

  1. ఫరోకు నేనింక దాసుడను కాను పరమకానానుకు హక్కుదారుడను ||నా సంక||

  2. మారాను మధురముగ మార్చినాకు బండను పగులగొట్టి దాహం దీర్చెను ||నా సంక||

  3. మనోహరముగ నున్న కానాన్ రాజ్యమే అదే నాకు స్థిరమైన అవకాశము ||నా సంక||

  4. ఆనందమే పరమానందమే కానాన్ జీవితము నాకు ఆనందమే ||నా సంక||

  5. అరణ్యజీవితమున యేసు నాయకుడు ప్రతిదినం నూతనమన్నా ఆయన యిస్తాడు ||నా సంక||

  6. నా బలము నా ఆశ్రయము నా రక్షణ యేసయ్య హల్లెలూయా ||నా సంక||

Post a Comment

أحدث أقدم