604
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్ మరిజేతుము పలు విధముల మార్గములలో ప్రభువే తోడైయుండుగా ||దైవ||
నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము నిలిచియుందుము క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా ||దైవ||
మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్గును వేదన మనసు హృదయము కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో ||దైవ||
జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు ఆదినుండి యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా ||దైవ||
إرسال تعليق