యెహోవా నా బలమా

682

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    యెహోవా నా బలమా యధార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ||యెహోవా||

  1. నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను వరదవలె భక్తిహీనులు పొర్లిన వదలక నను ఎడబాయని దేవా ||యెహోవా||

  2. మరణపు టురువులు మరువక మొరలిడ ఉన్నతదుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొరవినెను అదిరెను ధరణి భయకంపముచే ||యెహోవా||

  3. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగ జేయున్ జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల జేర్చిన బలమైన దేవుడు ||యెహోవా||

  4. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని దహించివేసెను వైరుల నెల్లను ||యెహోవా||

  5. మేఘములపై ఆయన వచ్చును మేఘములను తన మాటుగ జేయును ఉరుముల మెరుపుల మెండుగ జేసి అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా||

  6. దయగలవారిపై దయచూపించును కఠినుల యెడల వికటము జూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాధికారి ||యెహోవా||

  7. నా కళ్ళను లేడికాళ్ళగ జేయును యెత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ తన పక్షము జేర్చిన ||యెహోవా||

  8. యెహోవా జీవము గల దేవా బహుగ స్తుతులకు అ

Post a Comment

أحدث أقدم