పరములోన బరములోన

503

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    పరములోన బరములోన పాప మేమి లేదుగా నరయ దాని గోరు వారి కాశ యిందు లేదుగా ||పరములోన||

  1. వృద్ధ సర్చ మనెడు వాని సుద్ధు లందు లేవుగా సద్దులేని చోట నెపుడు స్వామి సేవ గల్గుగా ||పరములోన||

  2. ఎల్ల రోగ శ్రమలు మనకు నీ స్థలంబులోనెగా కల్లగాదు క్రీస్తు మనకు గంటి నీళ్లు దుడుచుగా ||పరములోన||

  3. అంధకారమైన కార్యము లా స్థలమున లేవుగా సందె వెలుగు వెలుగు నట్లు స్వామి సన్నిధి యుండుగా ||పరములోన||

  4. దొంగవాని వలన మనకు దోపు లేమి లేవుగా యంగలార్పు దీర్చి క్రీస్తు ఆశ్రయముగ నిల్చుగా ||పరములోన||

  5. అన్నపానములందు మనకు నాశ యేమి లేదుగా కన్న తండ్రి కన్న మిగుల ఘనుని ప్రేమ గల్గుగా ||పరములోన||

    ✍ గొల్లపల్లి నతానియేలు

      Paramulona Baramulona- Papa Memi Ledhugaa = Naraya Dhani Goru Vaari – Kasha Yandhu Ledhugaa || Paramulona ||

    1. Vrudhi Sarcha Manedu Vaani – Sudhu Landhu Levugaa = Sadhuleni Chota Nepudu – Swami Seva Galgaga || Paramulona ||

    2. Yella Roga Shramal Manaku – Neee Stalambhulonegu = Kalagaadhu Kristhu Manaku – Ganti Neeelu Dhuduchughaa || Paramulona ||

    3. Andhakaaramaina Karyamu – Laa Sthalamuna Levuga = Sandhe Velugu Velugu Natlu – Swami Sanidhi Yundaga || Paramulona ||

    4. Dhongavaani Valana Manaku – Dhopu Lemi Levuga = Yagalaarpu Dhirchi Migula – Ghanuni Prema Galguga || Paramulona ||

    5. Anna Panamulamdhu Manku – Nasa Yemi Ledhuga = Kanna Thandri Kanna Migula – Ghanuni Prema Galguga || Paramulona ||

      ✍ Gollapalli Nathaniyelu

Post a Comment

أحدث أقدم