684
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
- కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు ||రమ్ము||
- అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును ||రమ్ము||
- మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము ||రమ్ము||
- తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్ ||రమ్ము||
- సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్యజీవమును నీకిచ్చున్ నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్ ||రమ్ము||
إرسال تعليق