Song no: 154
ఎవరు భాగ్యవంతు లౌదు రవని లోపల మోక్ష వివరమైన క్రీస్తు బోధ చెవులొగ్గి వినువారికన్న ||నెవరు||
కవులు లాభ మరసి చేయు కపట మంత్రముల్ విధులు దవులఁ బోవఁ దరిమి యేసు తత్వముఁగొనువారికన్న ||నెవరు||
దీనమానసుల కట్టి యుప దేశ మిచ్చెను దివ్య మైన మోక్ష రాజ్యము వారి దౌనటంచు ప్రభువు తెల్పె ||నెవరు||
వృజినములకై దుఃఖించెడి సుజను లెవ్వరో వారు నిజముగ నోదార్పుఁ బొంది నిత్య సంతోషింతు లని తెల్పె ||నెవరు||
శాంతి నీతికరుణల యందా సక్తిగల వారు భూస్వతంత్రులై పరి తృప్తినొంది దయఁ బడసెద రని ప్రభువు తెల్పె ||నెవరు||
పరిశుద్ధ హృదయులు పరా త్పరునఁ జూతురు సర్వ నరుల సమాధానపరచు నరులె పరమ జనకుని సుతులు ||నెవరు||
నీతికొర కాపద నొందెడి నిశ్చ లాత్ములు వారు ఖ్యాతిగఁ బర లోక రాజ్య ఘన సౌఖ్యము లెల్లను బడయుదురు ||ఎవరు||