Song no:
- దీనుడా అజేయుడా
ఆదరణ కిరణమా
- సమ్మతిలేని సుడిగుండాలే
ఆవరించగా
గమనములేని పోరాటాలే తరుముచుండగా
నిరుపేదనైన నాయెడల సందేహమేమి లేకుండా
హేతువేలేని ప్రేమ చూపించి సిలువచాటునే దాచావు } 2
సంతోషము నీవే అమృత సంగీతము నీవే
స్తుతిమాలిక నీకే వజ్రసంకల్పము నీవే || దీనుడా ||
- సత్య ప్రమాణము నెరవేర్చుటకే
మార్గదర్శివై
నిత్యనిబంధన నాతో చేసిన సత్యవంతుడా
విరిగి నలిగిన మనస్సుతో హృదయార్చనే చేసేద
కరుణనీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా } 2
కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా
విశ్వాసము నీవే విజయశిఖరము నీవేగా || దీనుడా ||
- ఊహకందని ఉన్నతమైనది
దివ్యనగరమే
స్పటికము పోలిన సుందరమైనది నీరాజ్యమే
ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు
అమరలోకాన నీసన్నిధిలో క్రొత్త కీర్తనే పాడెదను} 2
ఉత్సాహము నీవే నయనోత్సవం నీవేగా
ఉల్లాసము నీలో ఊహలపల్లకి నీవేగా || దీనుడా ||
పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా } 2
జీవదాతవు నీవని శృతిమించి పాడనా
జీవధారవు నీవని కానుకనై పూజించనా } 2
అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే
స్వరార్చన చేసిద నీకే నా స్తుతులర్పించెద నీకే || దీనుడా ||
- Deenudaa ajaeyuDaa
aadaraNa kiraNamaa
- sammatilaeni suDiguMDaalae
aavariMchagaa
gamanamulaeni pOraaTaalae tarumuchuMDagaa
nirupaedanaina naayeDala saMdaehamaemi laekuMDaa
haetuvaelaeni praema choopiMchi siluvachaaTunae daachaavu
saMtOshamu neevae amRta saMgeetamu neevae
stutimaalika neekae vajrasaMkalpamu neevae || Deenuda ||
- satya pramaaNamu neravaerchuTakae
maargadarSivai
nityanibaMdhana naatO chaesina satyavaMtuDaa
virigi naligina manassutO hRdayaarchanae chaesaeda
karuNaneeDalO kRpaavaaDalO neetO uMTae chaalayyaa
kartavyamu neevae kanula paMDuga neevaegaa
viSvaasamu neevae vijayaSikharamu neevaegaa || Deenuda ||
- oohakaMdani unnatamainadi
divyanagaramae
spaTikamu pOlina suMdaramainadi neeraajyamae
aa nagaramae lakshyamai mahimaatmatO niMpinaavu
amaralOkaana neesannidhilO krotta keertanae paaDedanu
utsaahamu neevae nayanOtsavaM neevaegaa
ullaasamu neelO oohalapallaki neevaegaa || Deenuda ||
poojyuDaa paripoorNuDaa aanaMda nilayamaa
jeevadaatavu neevani SRtimiMchi paaDanaa
jeevadhaaravu neevani kaanukanai poojiMchanaa
akshaya deepamu neevae naa rakshaNa SRMgamu neevae
svaraarchana chaesida neekae naa stutularpiMcheda neekae || Deenuda ||
إرسال تعليق