الصفحة الرئيسيةA.R Stevenson Sageti e jeeva yathralo regeti సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి byOnline Lyrics List —نوفمبر 08, 2019 0 Song no: 111 సాగేటి ఈ జీవయాత్రలో రేగేటి పెనుతుఫానులెన్నో ఆదరించవా నీ జీవవాక్కుతో - సేదదీర్చవా నీ చేతి స్పర్శతో సుడిగుండాలెన్నో లోకసాగరాన వడిగా నను లాగి పడద్రోసే సమయాన } 2 నడిపించగలిగిన నా చుక్కాని నీవే } 2 విడిపించగలిగిన నాకున్న దిక్కు నీవే } 2 యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2 || సాగేటి || వడగాడ్పులెన్నో నా పయనంలోన నడవనీక సొమ్మసిల్లజేసే సమయాన } 2 తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే } 2 కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే } 2 యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2 || సాగేటి || అలలా శ్రమలెన్నో బ్రతుకు నావ పైన చెలరేగి విలవిలలాడించే సమయాన } 2 నిలబెట్టి బలపరచే బలవంతుడ నీవే } 2 కలవరమును తొలగించే కన్నతండ్రి నీవే } 2 యేసయ్యా ఓ మెస్సీయా - హల్లెలూయా నీకే స్తోత్రమయా } 2 || సాగేటి || || Yese Nija Devudu ||