Na prana priyudu yesayya నా ప్రాణ ప్రియుడు యేసయ్య

Song no: 110

    నా ప్రాణ ప్రియుడు యేసయ్య - కరుణా హృదయుడు యేసయ్య } 2
    పరలోకసుతుడు - నాకెంతోహితుడు - నమ్మదగిన నా స్నేహితుడు

  1. అతిసుందరుడు - ధవళవర్ణుడు
    స్తుతియింపదగిన ఘననామధేయుడు } 2
    నను ప్రేమించిన నజరేతువాడు } 2
    నాకు చాలినదేవుడు - నా హృదయపు నాధుడు

    యేసయ్య నా యేసయ్య (4) || నా ప్రాణ ప్రియుడు ||

  2. ఐశ్వర్యవంతుడు - దీర్ఘ శాంతుడు
    ఆశ్చర్యకరుడు - బహుబలవంతుడు } 2
    రుధిరము కార్చిన నిజమైన ఱేడు } 2
    ప్రాణమిచ్చిన దేవుడు - నా హృదయపు నాధుడు

    యేసయ్య నా యేసయ్య (4) || నా ప్రాణ ప్రియుడు ||

أحدث أقدم