నాకు జీవమై ఉన్న నా జీవమా

Song no:
    నాకు జీవమై ఉన్న నా జీవమా
    నాకు ప్రాణమై ఉన్న నా ప్రాణమా
    నాకు బలమై ఉన్న నా బలమా
    నాకు సర్వమై ఉన్న నా సర్వమా
    నీ నామమే పాడెదన్ నా జీవిత కాలమంతా
    నీ ధ్యానమే చేసెద నా ఊపిరి ఉన్నంత వరకు ||నాకు జీవమై||

  1. పూజ్యుడవు… ఉన్నత దేవుడవు
    యోగ్యుడవు… పరిశుద్ధ రాజువు } 2
    నా ఆరాధన నా ఆలాపన
    నా స్తుతి కీర్తన నీవే
    నా ఆలోచన నా ఆకర్షణ
    నా స్తోత్రార్పణ నీకే ||నాకు జీవమై||

  2. నాయకుడా… నా మంచి స్నేహితుడా
    రక్షకుడా… నా ప్రాణ నాథుడా } 2
    నా ఆనందము నా ఆలంబన
    నా అతిశయము నీవే
    నా ఆదరణ నా ఆశ్రయము
    నా పోషకుడవు నీవే ||నాకు జీవమై||