Chintha yendhukamma yesayy chentha vundaga చింత ఎందుకమ్మా యేసయ్య చెంత ఉండగా

చింత ఎందుకమ్మా యేసయ్య చెంత ఉండగా
దిగులు ఎందుకమ్మా దారిచూపే దైవము ఉండగా |2|
కన్నీరే పన్నీరవ్వదా తన కృప ఉంటే నీ తోడుగా
చీకటి బ్రతుకున నీవు చూడగలవు వెలుగుల పండగ |2|
విడిచిపెట్టుము నీ భయము ఇక యేసయ్య తోడు కడదాకా|2|
నీ భారము యెహోవా మీద మోపుము..మోపుము..
ఆయనే నిన్ను ఆదుకొనును..ఆదుకొనును

గాయపరచకుంటే  వెదురు వేణువవ్వద్దులే
ఆ గాయాలలో నుండే స్వరములెన్నో వచ్చునులే |2|
గుండె గాయాన్ని తలచి వేదనను రేపుకోకూ |2|
దేవుని సన్నిధి చేరి వాక్యంతో ఆదరణ పొందు
సువార్త స్వరమును పలికి వేణువుగా మ్రోగుతావు
సత్యమార్గాన్ని చూపే సాధనంగా వెలుగొందుతావు
         |చింత ఎందుకమ్మా|

రాగాలు పలుకని వీణగా మిగిలి పోయినా
బంధాల తీగలన్ని తెగిపడి చేదిరిపోయినా|2|
కలలు కన్నీరైపోతే లోకాన్ని విడిచిపోకు |2|
ప్రేమను పంచె దైవం చేతులు చాపెను నీ కొరకు
యేసయ్య శాశ్వత ప్రేమతో బంధాలను ఐక్యాపరచును
నిన్ను ప్రేమతో తాకి చింతను తొలగించును
         |చింత ఎందుకమ్మా|

Post a Comment

أحدث أقدم