Yenni thalachina yedhi adigina ఎన్ని తలచినా ఏది అడిగినా


ఎన్ని తలచినా ఏది అడిగినా   }
జరిగేది నీచిత్తమే                    }2 ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని   }
నా ప్రార్థనఆలకించుమా     }2 ప్రభువా
             1
నీ తోడు లేక నీ ప్రేమ లేక        }
ఇలలోన ప్రాణి నిలువలేదు }2
అడవి పూవులే నీ ప్రేమ పొందగా 2
నా ప్రార్థన ఆలకించుమా 2 ప్రభువా      ఎన్ని
              2
నా ఇంటి దీపం నీవే అని తెలసి          }
నా హృదయం నీ కొరకై పదిలపరచితి }2
ఆరిపోయిన నా వెలుగు దీపము 2
వెలిగించుము నీ ప్రేమతో 2 ప్రభువా      ఎన్ని
              3
ఆపదలు నన్ను వెన్నంటియున్నా  }
నా కాపరి నీవై నన్నాదుకొంటివి     }2
లోకమంతయూ నన్ను విడచినా 2
నీ నుండి వేరు చెయ్యవు 2 ప్రభువా      ఎన్ని
             4
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి }
నా కొరకై కల్వరిలో యాగమైతివి     }2
నీదు యాగమే నా మోక్ష మార్గము 2
నీయందే నిత్యజీవము 2 ప్రభువా         ఎన్ని

أحدث أقدم