Yesuni namamlo mana badhalu povunu యేసుని నామములో మన బాధలు పోవును


యేసుని నామములో మన బాధలు పోవును
          దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును
          మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమమదొచ్చును
.. యేసు రక్తముకే యేసు నామముకే యుగయుగములకు మహిమే
          అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమున జయమే

1.        ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా
          ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే ఐనా
          ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు
          పరివర్తన చెందినచో పరలోకం చేరేదవు        ||యేసు రక్తముకే||

2.       రాజువైన యాజకుడవైనా నిరుపేదవైన బ్రతుకు చెడియున్నా
          ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువనీడే నీకు లేకున్నా
          శ్రీ యేసుని నామములో విశ్వాసం నీకున్నా 
          నీ స్థితి నేడేదైనా నిత్యజీవము పొందెదవు     ||యేసు రక్తముకే||

أحدث أقدم