Yehova deva ye reethi nee runam thirchukonaya యెహోవా దేవా ఏ రీతి నీ ఋణం తీర్చుకోనయా


యెహోవా దేవా  ....  నాపై నీకెంత ప్రేమయా    (2)
నను నీ దరికి చేర్చ - యేసయ్యను బలిగా అర్పించావయా   (2)

1. నిన్ను కాదని లోకమే మేలని గాలిలో ధూళిలా తిరుగుచుంటిని
 సంతోషమును సమాధానమును ఎక్కడెక్కడో నే వెదుకుచుంటిని
నీ దయతో నను కనుగొంటివి
నీదు ప్రేమతో నను మార్చితివి
నీ కృపలో నను కాచితివి

2. నిన్ను కాదని నేనే గొప్ప అనుకొని సర్వము శూన్యముతో నింపుకుంటిని
నా శక్తితో,  నా యుక్తితో ఇలలో  ఏదియు సాధించలేకపోతిని
నీదు సత్యమే నాకు విముక్తి
నీదు ఆత్మయే నాకు శక్తి   
నీదు  మార్గమే నిత్య జీవము
أحدث أقدم