Nee padha dhulinai samkeerthi swaramunai ne padana నీ పాద ధూళినై సంకీర్తనా స్వరమునై నే పాడనా






సాఖి: నీ పాద ధూళినై .... సంకీర్తనా స్వరమునై ... నే పాడనా  ... నీ ప్రేమ గీతం

నే పాడనా  ... నీ ప్రేమ గీతం
నన్నెంతగానో ప్రేమించిన నీ దివ్య చరితం   
నీ పాద ధూళినై .... సంకీర్తనా స్వరమునై 
నే పాడనా  ... నీ ప్రేమ గీతం

యేసయా  - నా యేసయా -  సర్వము నీవేనయ దాసురాలికి

1. ఆపదలో  ఉన్ననన్ను ఆప్తుడై ఆదుకుంటివి  - నీ ప్రేమను నే రుచి చూసితినీ
నశించవలసిన నన్ను వెదకీ రక్షించితివీ - నీ క్రుపను నే పొందుకుంటినీ 
నా కన్నీటి బొట్టు నేల జారక మునుపే - చిరునవ్వై నాట్యమాడుచున్నదీ
మహిమ,  ఘనత నీకే -  నా యేసు దేవా 

 2.  ఘోర సిలువను నాకై ధరియించితివి  - నిత్య ప్రేమతో నన్ను జయించితివీ
నీ  అరచేతిలో నన్ను దాచుకుంటివి   - నిత్య రక్షణలో నను నడిపించితివీ
నేను సైతము నీ ఆత్మ జ్వాలలో  -  నీ సేవకై  నే తపియించితినీ
మహిమ,  ఘనత నీకే -  నా యేసు దేవా

أحدث أقدم