Mandhiramuloniki rarandi vandhaneeyudesuni cherandi మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి


Song no:


మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి
కలవరమైనా కలతలు ఉన్నా - తొలగిపోవును ఆలయాన చేరను
కలుగు సుఖములు ప్రభుని వేడను

1.దేవుని తేజస్సు నిలచే స్థలమిది-
క్షేమము కలిగించు ఆశ్రయపురమిది
వెంటాడే భయములైనా వీడని అపజయములైనా ||తొలగిపోవును||

2.సత్యము భోదించు దేవుని బడి ఇది
ప్రేమను చాటించు మమతల గుడి ఇది
శ్రమలవలన చింతలైనా శత్రువులతో చిక్కులైనా ||తొలగిపోవును||

3.శాంతి ప్రసాదించు దీవెన గృహమిది
స్వస్థత కలిగించు అమృత జలనిధి
కుదుటపడని రోగమైనా ఎదను తొలచు వేదనైనా ||తొలగిపోవును||

أحدث أقدم