Loka kalyanam loka kalyanam లోక కళ్యాణం .... లోక కళ్యాణం...


శాంతి సమాధాన సమాహారం
ప్రేమసువార్తకు మానవ రూపం
శోధన నిరీక్షణకు  సమాధానం
క్రీస్తుని జననం ... ప్రభు యేసుని ఉదయం

1. జగతికై జన్మించె దేవుడై - బెత్లేహేములో బాలుడై
పాకలో పుట్టె పుణ్యుడై  - పరమ పావనుడై
ధరలో వెలసే దీనుడై  (2)  నిత్య జీవ మార్గమై

ఢంకానాదముతో స్తుతిగానముతో - వేనోళ్ళ చాటుదాము రండి ...  
యేసు మనకై పుట్టాడని - దివి నుండి దిగి వచ్చాడని
లోక రక్షకుడు యేసే అని .... రాజాది రాజు క్రీస్తే అని
తాన తాన తందనాన
హ్యాపీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

2. కల్వరి సిలువలో బలియాగము  -  చేసిన గొప్ప త్యాగము 
మనకై  కార్చిన రక్తము  - దహించివేసెను ప్రతి పాపము
 సర్వలోక విమోచనకై   (2) జరిగిన  ప్రాణార్పనము 

ఢంకానాదముతో స్తుతిగానముతో - వేనోళ్ళ చాటుదాము రండి ...  
యేసు తిరిగి లేచాడని - మనలో మళ్లీ పుట్టాడని
లోక రక్షకుడు యేసే అని .... రాజాది రాజు క్రీస్తే అని
తాన తాన తందనాన
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్

أحدث أقدم